మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Naga Kavacham in Telugu – నాగ కవచం


నాగరాజస్య దేవస్య కవచం సర్వకామదమ్ |
ఋషిరస్య మహాదేవో గాయత్రీ ఛంద ఈరితః || 1 ||

తారాబీజం శివాశక్తిః క్రోధబీజస్తు కీలకః |
దేవతా నాగరాజస్తు ఫణామణివిరాజితః || 2 ||

సర్వకామార్థ సిద్ధ్యర్థే వినియోగః ప్రకీర్తితః |
అనంతో మే శిరః పాతు కంఠం సంకర్షణస్తథా || 3 ||

కర్కోటకో నేత్రయుగ్మం కపిలః కర్ణయుగ్మకమ్ |
వక్షఃస్థలం నాగయక్షః బాహూ కాలభుజంగమః || 4 ||

ఉదరం ధృతరాష్ట్రశ్చ వజ్రనాగస్తు పృష్ఠకమ్ |
మర్మాంగమశ్వసేనస్తు పాదావశ్వతరోఽవతు || 5 ||

వాసుకిః పాతు మాం ప్రాచ్యే ఆగ్నేయాం తు ధనంజయః |
తక్షకో దక్షిణే పాతు నైరృత్యాం శంఖపాలకః || 6 ||

మహాపద్మః ప్రతీచ్యాం తు వాయవ్యాం శంఖనీలకః |
ఉత్తరే కంబలః పాతు ఈశాన్యాం నాగభైరవః || 7 ||

ఊర్ధ్వం చైరావతోఽధస్తాత్ నాగభేతాళనాయకః |
సదా సర్వత్ర మాం పాతు నాగలోకాధినాయకాః || 8 ||

ఇతి నాగ కవచమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.